వార్త ముఖ్యాంశాలు
- - పోలింగ్ శాతం అంతంత మాత్రమే - పోలింగ్‌కు వర్షం ఆటంకం గురువారం రాష్ట్రంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
- అయితే గురువారం జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పోలింగ్‌కు అనేక చోట్ల అంతరాయాలు ఏర్పడ్డాయి.
- జోరు వర్షంలోనూ కొంతమంది పట్టు విడవని విక్రమార్కుల్లా వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు.
– పోలింగ్ శాతం అంతంత మాత్రమే
– పోలింగ్‌కు వర్షం ఆటంకం
గురువారం రాష్ట్రంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే గురువారం జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పోలింగ్‌కు అనేక చోట్ల అంతరాయాలు ఏర్పడ్డాయి. జోరు వర్షంలోనూ కొంతమంది పట్టు విడవని విక్రమార్కుల్లా వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు.
పొదలకూరు, ఆత్మకూరు తదితర చోట్ల చిన్నచిన్న ఘర్షణలు జరిగాయి. పొదలకూరులో జరిగిన ఘర్షణ పెద్దదే కాగా, ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిల మధ్య సైతం వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను లాఠీలతో చెదరగొట్టారు.
ఓ వైపు వర్షం, మరోవైపు పోలింగ్. ఎన్నికల అధికారులు వేసిన షామియానాలు పూర్తిగా తడిచిపోయి, వాటి నుంచి వర్షపు నీరు కారడంతో అనేక చోట్ల ఓటర్లు తడిసి ముద్దయ్యారు. అయినా ఓటర్లు మాత్రం పట్టుదలతో తమ ఓట్లను వినియోగించుకున్నారు. అయితే మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు పలుచగా హాజరయ్యారు. ఈ గైర్హాజరీల నేపథ్యంలో పోలింగ్ శాతం పెద్దగా ఊపందుకోలేదు. అనేక మండలాల్లో పోలింగ్ శాతం తగ్గినట్లు ముందస్తు సమాచారం. అయితే వర్షం తగ్గిన తర్వాత ఆయా గ్రామాలు, మండలాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీయడం కనిపించింది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్