శ్రీ కాళహస్తి, జులై 11 : (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మూడో గేటు సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన భక్తురాలిని ఆలయ చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ఆసుపత్రిలో పరామర్శించారు. గుంటూరు జిల్లాకు చెందిన మౌనిక అనే భక్తురాలు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయపడినట్లు సమాచారం అందుకున్న వెంటనే ఆయన ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన చైర్మన్, దేవస్థానం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. భక్తుల భద్రతకు దేవస్థానం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితురాలికి సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్న దేవస్థానం ఈఓతో పాటు వైద్య బృందాన్ని కొట్టే సాయిప్రసాద్ అభినందించారు.

ప్రమాద బాధిత భక్తురాలిని పరామర్శించిన ఆలయ చైర్మన్