Monday, 21 September 2026
  • Home  
  • ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: బీజేపీ
- ఖమ్మం

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: బీజేపీ

రఘునాధ పాలేం / ఖమ్మం రఘునాథపాలెం: మండలంలోని జింకల తండా ఎక్స్‌రోడ్‌ నుంచి మంచుకొండ, బూడిదంపాడు వరకు తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ మండల నాయకులు కోరారు. ఈ విషయమై రఘునాథపాలెం పోలీస్‌ స్టేషన్‌ సీఐని మర్యాదపూర్వకంగా కలిసి ప్రమాదాల పరిస్థితిపై చర్చించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆర్‌అండ్‌బీ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు సీఐ తెలిపారని నాయకులు పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో సామాజిక బాధ్యతగా రహదారి భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో బీజేపీ మండల శాఖ తరఫున అండగా ఉంటామని వెల్లడించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, అవసరమైన రహదారి భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గుత్తా వంశీ, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గంధసిరి వీరభద్ర గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు లకావత్ రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

రఘునాధ పాలేం / ఖమ్మం

రఘునాథపాలెం: మండలంలోని జింకల తండా ఎక్స్‌రోడ్‌ నుంచి మంచుకొండ, బూడిదంపాడు వరకు తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ మండల నాయకులు కోరారు. ఈ విషయమై రఘునాథపాలెం పోలీస్‌ స్టేషన్‌ సీఐని మర్యాదపూర్వకంగా కలిసి ప్రమాదాల పరిస్థితిపై చర్చించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆర్‌అండ్‌బీ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు సీఐ తెలిపారని నాయకులు పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో సామాజిక బాధ్యతగా రహదారి భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో బీజేపీ మండల శాఖ తరఫున అండగా ఉంటామని వెల్లడించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, అవసరమైన రహదారి భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గుత్తా వంశీ, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గంధసిరి వీరభద్ర గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు లకావత్ రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.