విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ బోర్డులు, ప్రొజెక్టర్లు, ఈ-లెర్నింగ్ కంటెంట్ అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
విద్యార్థులు సులభంగా పాఠాలు అర్థం చేసుకునేందుకు ఈ సాంకేతిక వసతులు ఉపయోగపడతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.


