Monday, 21 September 2026
  • Home  
  • ప్రభుత్వ ఆసుపత్రికి సేవా సహాయం చేసిన డాక్టర్ కర్ణకోట కళావతి
- నిర్మల్

ప్రభుత్వ ఆసుపత్రికి సేవా సహాయం చేసిన డాక్టర్ కర్ణకోట కళావతి

ఆసుపత్రికి రూ.లక్ష విలువైన ఈసీజీ యంత్రం బహూకరణ ముధోల్, ఆగస్టు 4(తెలంగాణ పున్నమి ప్రతినిధి ):ముథోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 1974–76 సంవత్సరాల్లో వైద్యురాలిగా సేవలందించిన డాక్టర్ కర్ణకోట కళావతి తాను పనిచేసిన ఆసుపత్రిని మరువకుండా రోగుల సేవార్థం రూ.లక్ష విలువైన ఈసీజీ యంత్రాన్ని బహూకరించారు. అలాగే ఆసుపత్రిలో రోగులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ప్యూరిఫైయర్‌ను కూడా అందజేశారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా సుమారు 50 సంవత్సరాల క్రితం ముథోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారిగా వైద్యురాలిగా విధులు నిర్వహించిన రోజులను డాక్టర్ కళావతి గుర్తు చేసుకున్నారు. తాను పనిచేసిన ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈసీజీ యంత్రం, వాటర్ ప్యూరిఫైయర్‌ను అందజేసినట్లు తెలిపారు. ముథోల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఈసీజీ యంత్రం, వాటర్ ప్యూరిఫైయర్‌ను ప్రారంభించారు. తాను పనిచేసిన ప్రాంతాన్ని, ఆసుపత్రిని మరువకుండా రోగుల కోసం తనవంతు సహాయం చేసిన డాక్టర్ కర్ణకోట కళావతికి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ వీడియో కాల్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ అస్రార్, టి బి సూపర్వైజర్ లాలయ్య,నర్సులు, ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ కళావతి సేవా భావాన్ని అభినందించారు.

ఆసుపత్రికి రూ.లక్ష విలువైన ఈసీజీ యంత్రం బహూకరణ
ముధోల్, ఆగస్టు 4(తెలంగాణ పున్నమి ప్రతినిధి ):ముథోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 1974–76 సంవత్సరాల్లో వైద్యురాలిగా సేవలందించిన డాక్టర్ కర్ణకోట కళావతి తాను పనిచేసిన ఆసుపత్రిని మరువకుండా రోగుల సేవార్థం రూ.లక్ష విలువైన ఈసీజీ యంత్రాన్ని బహూకరించారు. అలాగే ఆసుపత్రిలో రోగులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ప్యూరిఫైయర్‌ను కూడా అందజేశారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా సుమారు 50 సంవత్సరాల క్రితం ముథోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తొలిసారిగా వైద్యురాలిగా విధులు నిర్వహించిన రోజులను డాక్టర్ కళావతి గుర్తు చేసుకున్నారు. తాను పనిచేసిన ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈసీజీ యంత్రం, వాటర్ ప్యూరిఫైయర్‌ను అందజేసినట్లు తెలిపారు. ముథోల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఈసీజీ యంత్రం, వాటర్ ప్యూరిఫైయర్‌ను ప్రారంభించారు. తాను పనిచేసిన ప్రాంతాన్ని, ఆసుపత్రిని మరువకుండా రోగుల కోసం తనవంతు సహాయం చేసిన డాక్టర్ కర్ణకోట కళావతికి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ వీడియో కాల్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ అస్రార్, టి బి సూపర్వైజర్ లాలయ్య,నర్సులు, ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ కళావతి సేవా భావాన్ని అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.