Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ప్రభుత్వం మీ వెన్నంటే… నా కార్డు తీసుకోండి.. సమస్య ఉంటే చెప్పండి.. బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపిన కలెక్టర్ భరోసా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రభుత్వం మీ వెన్నంటే… నా కార్డు తీసుకోండి.. సమస్య ఉంటే చెప్పండి.. బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపిన కలెక్టర్ భరోసా

వార్త ముఖ్యాంశాలు

  • విషాదకర బాయిలర్ పేలుడు ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తనదైన శైలిలో ధైర్యం నింపారు.
  • మీ వెన్నంటే ప్రభుత్వము ఉంది...
  • మీకు ఏ అవసరం ఉన్నా...

విషాదకర బాయిలర్ పేలుడు ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తనదైన శైలిలో ధైర్యం నింపారు. మీ వెన్నంటే ప్రభుత్వము ఉంది… మీకు ఏ అవసరం ఉన్నా… నాతో మీరు నేరుగా మాట్లాడండి… తీసుకోండి
నా కార్డు… ఇందులో నా సెల్ ఫోన్ నెంబర్ ఉంది… సమస్య ఏదైనా వస్తే… నా సెల్ ఫోన్ కు కాల్ చేయండి అంటూ కలెక్టర్ బాధిత కుటుంబాలకు అండగా నిలవడం గొప్ప విషయం. శ్రీ సిటీ పరిధి టి ఐ ఎల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంటి పెద్ద దిక్కున కోల్పోయిన కుటుంబ సభ్యులతో కలెక్టర్ నేరుగా సమావేశం ఏర్పాటు చేసి వారి సాధకబాదాలను తెలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కలెక్టరిచ్చిన విస్టింగ్ కార్డులో ఆయన సెల్ నెంబర్ ఉండటం, ఆ నెంబర్కు స్వయంగా ఇద్దరు కాల్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. తమిళనాడుకు చెందిన రమేష్, మోహన్ కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్లు తమిళనాడు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వారికి వివరించారని సమాచారం.

నష్టపరిహారంగా ఒక్కో కుటుంబానికి 50 లక్షలు, ఇతర ఈఎస్ఐ పీఎఫ్ లతో కూడిన నగదు కూడా వారి వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ వ్యవహారం పూర్తి చేయించడంలో జిల్లా కలెక్టర్ తీసుకున్న చొరవ కు తమిళనాడు రాష్ట్రం గుమ్మడిపూడి ఎమ్మెల్యే ఎస్ విజయ్ కుమార్ ప్రశంసించారు.

అదే సందర్భంలో బాధిత కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలకు విద్యా వసతులు తామే దగ్గరుండి చూసుకుంటామని, పిల్లలు ఎక్కడ ఏ కాలేజీలో, ఏ స్కూల్లో చదువుకోవాలన్న తాము ముందుండి సహకరిస్తామని శ్రీ సిటీ ఎండి డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హామీ ఇవ్వడం, ఆ హామీకి కట్టుబడి పిల్లలతో నేరుగా మాట్లాడడం చాలా మంచి విషయం అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *