Monday, 21 September 2026
  • Home  
  • ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల వినతులు స
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల వినతులు స

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐపోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేశారు.శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రజల వినతులను స్వీకరించి వారి సమస్యలను పరిశీలించారు. తక్షణం పరిష్కరించగలిగిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోగా, మరికొన్ని సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, తెలుగుదేశం పార్టీ తాళ్లరేవు మండల అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణ (బాబి),తదితరులు పాల్గొన్నారు .

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐపోలవరం మండలం
మురమళ్ళ గ్రామంలో శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేశారు.శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ప్రజల వినతులను స్వీకరించి వారి సమస్యలను పరిశీలించారు. తక్షణం పరిష్కరించగలిగిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోగా, మరికొన్ని సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, తెలుగుదేశం పార్టీ తాళ్లరేవు మండల అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణ (బాబి),తదితరులు పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.