Thursday, 14 May 2026
  • Home  
  • ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మే 14 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన ప్రధాన ధ్యేయమని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం శ్రీకాళహస్తిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా గ్రీవెన్స్’ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించారు. వ్యక్తిగత, గ్రామీణ సమస్యలకు సంబంధించిన ప్రతి అర్జీని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పింఛన్లు, తాగునీటి సమస్యలు, భూ వివాదాలు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన వినతులను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.