వార్త ముఖ్యాంశాలు
- 56 ఓట్ల మెజార్టీతో శోంఠ్యం ఎంపీటీసీ పీఠం వైసీపీ కైవసం!
- విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి) నవంబర్ 7 :: శోంఠ్యం ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్జానా రవికుమార్ ఘనవిజయం సాధించారు.
- తన సమీప ప్రత్యర్థి కూటమి అభ్యర్థి గొంతిన కనకరాజుపై 56 ఓట్ల మెజార్టీతో విజయభేరి మోగించారు.
56 ఓట్ల మెజార్టీతో శోంఠ్యం ఎంపీటీసీ పీఠం వైసీపీ కైవసం!
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం (పున్నమి ప్రతినిధి) నవంబర్ 7 ::
శోంఠ్యం ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొల్జానా రవికుమార్ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కూటమి అభ్యర్థి గొంతిన కనకరాజుపై 56 ఓట్ల మెజార్టీతో విజయభేరి మోగించారు.
ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఓటర్లు తమ తీర్పును స్పష్టంగా వెల్లడించారు. ఓట్ల లెక్కింపు అనంతరం రవికుమార్ విజయం ఖరారు కావడంతో ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఈ విజయం కేవలం ఒక ఎన్నికల గెలుపు మాత్రమే కాదు.. తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత కూడా. ప్రజల ఆదరాభిమానాలను గెలుచుకున్న గొల్జానా రవికుమార్ ఇక ప్రజాసేవలో తనదైన ముద్ర వేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.
56 ఓట్ల మెజార్టీతో మొదలైన ఈ విజయ ప్రస్థానం.. శోంఠ్యం అభివృద్ధికి కొత్త దిశ చూపాలని ప్రజలు ఆశిస్తున్నారు!
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్