రాజన్న సిరిసిల్ల జూలై 20 ( పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ సర్పంచ్ మాశెట్టి లచ్చయ్య గారి దశదినకర్మ కార్యక్రమం ఆదివారం గ్రామంలో విషాద వాతావరణంలో జరిగింది. ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన లచ్చయ్య గారి అకాల మరణం గ్రామ ప్రజలను, ప్రజాప్రతినిధులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల BRS పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చిగురు నరేష్, చీకోడ్ సర్పంచ్ బొమ్మేన ఆంజనేయులు, BRS నాయకులు తాడేపు ఎల్లం, పడిగే ఆంజనేయులు, దోనుకుల కర్ణకర్, మాజీ AMC వైస్ చైర్మన్ కొమ్మెట రాజమల్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని లచ్చయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మాశెట్టి లచ్చయ్య గారు ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన మంచి నాయకుడని, ఆయన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించారు.


