ధూమపానం ద్వారా మనం పీల్చే పొగలో 7,000కు పైగా రసాయనాలు ఉంటాయి. వీటిలో కనీసం 69 రసాయనాలు క్యాన్సర్‌కు కారణమవుతాయని గుర్తించారు. సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
ఊపిరితిత్తుల క్యాన్సర్: ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకం. నోరు, గొంతు, అన్నవాహిక, మూత్రాశయం సహా అనేక అవయవాల్లో క్యాన్సర్ వచ్చే ముప్పును కూడా పెంచుతుంది.
నోటి క్యాన్సర్: పొగాకు నమలడం, గుట్కా తదితర పొగాకు పదార్థాల వినియోగం నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి.
గుండెపోటు–పక్షవాతం: ధూమపానం రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు, పక్షవాతం వంటి హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
కుటుంబ ఆరోగ్యమే ఆర్థిక భద్రత
తీవ్రమైన అనారోగ్యం కుటుంబంపై భారీ వైద్య ఖర్చుల భారం మోపుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బు కుటుంబ అభివృద్ధి, పిల్లల చదువు, భవిష్యత్తుకు ఉపయోగపడాలి.
పొగాకు అలవాటు ఉన్నా మానేయడానికి ఆలస్యం కాదు. ఈరోజే స్వస్తి చెప్పండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.. కుటుంబానికి భరోసాగా నిలవండి!


