Saturday, 5 September 2026
  • Home  
  • *పేరంటాలమిట్ట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం,* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 24 చిట్టమూరు మండలం,* }
- తిరుపతి

*పేరంటాలమిట్ట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం,* } {*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 24 చిట్టమూరు మండలం,* }

*పేరంటాలమిట్ట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం,* *పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 24 చిట్టమూరు మండలం,* కోగిలి: పేరంటాల మిట్ట ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని 276వ బూత్‌ కన్వీనర్‌ తీపలపూడి ఉదయ్‌, కో-కన్వీనర్‌ తీపలపూడి రవి అన్నారు. కోగిలి పంచాయతీ టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ రషీద్‌ భాయ్‌ సహకారంతో పేరంటాల మిట్ట గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా పేరంటాల మిట్ట ప్రాంతాన్ని పలువురు నాయకులు పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.5 లక్షల మేర నిధుల సహకారం అందడంతో ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడిందన్నారు. అదేవిధంగా కొత్తగా రోడ్లకు ఇరువైపులా విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి, లైన్లను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. స్థానిక ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మంచినీటి సదుపాయం కూడా కల్పించినట్లు చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని తీపలపూడి ఉదయ్‌, తీపలపూడి రవి అన్నారు. ప్రజల సంక్షేమం కోసం జరుగుతున్న మంచి పనులను హేళన చేస్తే టీడీపీ శ్రేణులు, ప్రజలు సహించబోరని హెచ్చరించారు. 276వ బూత్‌ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు. పేరంటాల మిట్టలో మిగిలిన మౌలిక వసతుల అభివృద్ధికి కూడా తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తీపలపూడి ఉదయ్‌, తీపలపూడి రవి పేర్కొన్నారు.

*పేరంటాలమిట్ట అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం,*

*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగష్టు 24 చిట్టమూరు మండలం,*

కోగిలి: పేరంటాల మిట్ట ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని 276వ బూత్‌ కన్వీనర్‌ తీపలపూడి ఉదయ్‌, కో-కన్వీనర్‌ తీపలపూడి రవి అన్నారు. కోగిలి పంచాయతీ టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ రషీద్‌ భాయ్‌ సహకారంతో పేరంటాల మిట్ట గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వారు తెలిపారు.
గత మూడు దశాబ్దాలుగా పేరంటాల మిట్ట ప్రాంతాన్ని పలువురు నాయకులు పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.5 లక్షల మేర నిధుల సహకారం అందడంతో ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడిందన్నారు.
అదేవిధంగా కొత్తగా రోడ్లకు ఇరువైపులా విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి, లైన్లను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. స్థానిక ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మంచినీటి సదుపాయం కూడా కల్పించినట్లు చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు.
అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని తీపలపూడి ఉదయ్‌, తీపలపూడి రవి అన్నారు. ప్రజల సంక్షేమం కోసం జరుగుతున్న మంచి పనులను హేళన చేస్తే టీడీపీ శ్రేణులు, ప్రజలు సహించబోరని హెచ్చరించారు.
276వ బూత్‌ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని వారు తెలిపారు. పేరంటాల మిట్టలో మిగిలిన మౌలిక వసతుల అభివృద్ధికి కూడా తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తీపలపూడి ఉదయ్‌, తీపలపూడి రవి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.