Monday, 3 August 2026
  • Home  
  • పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండ.. 28 మందికి రూ.14.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
- అనకాపల్లి

పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం అండ.. 28 మందికి రూ.14.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 3 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎలమంచిలి టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ అప్పల చలపతిరావు సమక్షంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. టౌన్ అధ్యక్షుడు నానాజీ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు రూ.14.50 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. గతంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో అచ్చుతాపురం మండల అధ్యక్షుడు పీలా తులసిరాం, మునగపాక మండల అధ్యక్షుడు పెంటకోట విజయ్, ఎంపీటీసీ నీరుకొండ నర్సింగరావు, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 3 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎలమంచిలి టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ అప్పల చలపతిరావు సమక్షంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. టౌన్ అధ్యక్షుడు నానాజీ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు రూ.14.50 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. గతంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో అచ్చుతాపురం మండల అధ్యక్షుడు పీలా తులసిరాం, మునగపాక మండల అధ్యక్షుడు పెంటకోట విజయ్, ఎంపీటీసీ నీరుకొండ నర్సింగరావు, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.