వార్త ముఖ్యాంశాలు
- పెసా చట్టం కమిటీ సభ్యులుగా గ్రామ సభల ద్వారా ఎన్నికైన వారు సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే ముందుగా సభ్యత్వానికి రాజీనామా చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ సోమవారం ప్రకటనలో స్పష్టం చేశారు.
- నామినేషన్ వేసిన పెసా సభ్యులు, ఉపసంహరణ గడువు ముగియడానికి కనీసం ఒక రోజు ముందుగా పీఓకు రాజీనామా సమర్పించి ఆమోద పత్రం పొందాలన్నారు.
- ఆ పత్రాన్ని స్క్రూటినీ సమయానికి ముందే సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించి ఆమోదం పొందాలని తెలిపారు.
పెసా చట్టం కమిటీ సభ్యులుగా గ్రామ సభల ద్వారా ఎన్నికైన వారు సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే ముందుగా సభ్యత్వానికి రాజీనామా చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ సోమవారం ప్రకటనలో స్పష్టం చేశారు. నామినేషన్ వేసిన పెసా సభ్యులు, ఉపసంహరణ గడువు ముగియడానికి కనీసం ఒక రోజు ముందుగా పీఓకు రాజీనామా సమర్పించి ఆమోద పత్రం పొందాలన్నారు. ఆ పత్రాన్ని స్క్రూటినీ సమయానికి ముందే సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించి ఆమోదం పొందాలని తెలిపారు. ముందస్తు ఆమోదం లేకపోతే నామినేషన్ చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingపత్రికా ప్రకటన