నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గద్దె కూల్చివేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన ఈ చర్యను ఖండిస్తూ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఖానాపురం మండల నాయకులు. మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు .మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్. ఒడిసిఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోతు రామస్వామి గారు మాట్లాడుతూ.
గద్దె కూల్చివేతకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. తమ నాయకుడి గౌరవాన్ని కాపాడేందుకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని నాయకులు పేర్కొన్నారు.
ఈ ధర్నాలో వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు కార్యకర్తలు సీనియర్ నాయకులు యూత్ సభ్యులు మొదలైన వారు పాల్గొన్నారు.





