Tuesday, 9 June 2026
  • Home  
  • పులివెందుల మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరంగా మార్చడం శోచనీయం – జీ.వో. నం.590ను రద్దు చేయాలి
- ఆంధ్రప్రదేశ్

పులివెందుల మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరంగా మార్చడం శోచనీయం – జీ.వో. నం.590ను రద్దు చేయాలి

పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరంగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం 9-9-2025న జారీ చేసిన జీ.వో. నం. 590 శోచనీయం, దురదృష్టకరం అని రాజ్యసభ మాజీ ఎంపీ డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి, పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మూలం రెడ్డి ధ్రువకుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. గురువారం నాడు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు నల్ల జెండాలతో, నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కళాశాల సూపరింటెండెంట్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్య విద్యను ప్రైవేట్ పరంగా మార్చడం వల్ల సమాజానికి తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన స్వర్గీయ ఎన్టీఆర్ వైద్య విద్య ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన ఆశయాలకు విరుద్ధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యాజమాన్యం MBBS సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ, ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారని అన్నారు. అలాగే ఆసుపత్రిలో రోగులకు ఉచిత వైద్యం అందడం కూడా కష్టమవుతుందని వాపోయారు. అందువల్ల, పులివెందుల వైద్య కళాశాలను ప్రైవేట్ పరంగా మార్చుతూ జారీ చేసిన జీ.వో. నం.590ను వెంటనే రద్దు చేసి, ప్రభుత్వం పరంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు: బోనాల ఖాదర్, కల్యాణ్ రెడ్డి, నాగరాజు, చంద్రబాబు, వేంపల్లి మండల అధ్యక్షుడు బీగాల రామకృష్ణ, చక్రాయపేట మండల అధ్యక్షుడు రామాంజనేయులురెడ్డి, వేమయ్య, వేమ నాగరాజు, నరేంద్ర, బద్రీనాథ్, రాఘవయ్య, రవీంద్రనాథ్ రెడ్డి, ఉత్తన్న, అమర్, వినయ్, ఆదిల్, నాని, శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరంగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం 9-9-2025న జారీ చేసిన జీ.వో. నం. 590 శోచనీయం, దురదృష్టకరం అని రాజ్యసభ మాజీ ఎంపీ డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి, పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మూలం రెడ్డి ధ్రువకుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
గురువారం నాడు పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద కాంగ్రెస్ శ్రేణులు నల్ల జెండాలతో, నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కళాశాల సూపరింటెండెంట్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్య విద్యను ప్రైవేట్ పరంగా మార్చడం వల్ల సమాజానికి తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన స్వర్గీయ ఎన్టీఆర్ వైద్య విద్య ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన ఆశయాలకు విరుద్ధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ యాజమాన్యం MBBS సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ, ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారని అన్నారు. అలాగే ఆసుపత్రిలో రోగులకు ఉచిత వైద్యం అందడం కూడా కష్టమవుతుందని వాపోయారు.
అందువల్ల, పులివెందుల వైద్య కళాశాలను ప్రైవేట్ పరంగా మార్చుతూ జారీ చేసిన జీ.వో. నం.590ను వెంటనే రద్దు చేసి, ప్రభుత్వం పరంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు:
బోనాల ఖాదర్, కల్యాణ్ రెడ్డి, నాగరాజు, చంద్రబాబు, వేంపల్లి మండల అధ్యక్షుడు బీగాల రామకృష్ణ, చక్రాయపేట మండల అధ్యక్షుడు రామాంజనేయులురెడ్డి, వేమయ్య, వేమ నాగరాజు, నరేంద్ర, బద్రీనాథ్, రాఘవయ్య, రవీంద్రనాథ్ రెడ్డి, ఉత్తన్న, అమర్, వినయ్, ఆదిల్, నాని, శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.