డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 251 అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, రీ-సర్వే, పింఛన్లు, ఇంటి స్థలాలు, గృహాలు, పారిశుధ్యం, రహదారులు, ఉద్యోగ–ఉపాధి తదితర అంశాలకు సంబంధించి ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ మాట్లాడుతూ, పీజీఆర్ఎస్లో అందిన ప్రతి అర్జీని పారదర్శకంగా పరిశీలించి, అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడంతో పాటు, పరిష్కార వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను 1100 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు ‘మీకోసం’ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.:::

పీజీఆర్ఎస్లో 251 అర్జీలు స్వీకరణ