Wednesday, 30 September 2026
  • Home  
  • రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి: డాక్టర్ పినిపే శ్రీకాంత్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి: డాక్టర్ పినిపే శ్రీకాంత్

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం జనుపల్లి గ్రామంలో పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ స్వయంగా పరిశీలించారు. పంటలు నీట మునిగి నష్టపోతున్న రైతులు సమస్య పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కలిసి విజ్ఞప్తి చేయగా, ‘‘ఇవన్నీ కాటన్ దొర చేసిన తప్పులు’’ అని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని శ్రీకాంత్ ప్రశ్నించారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో బాధ్యతాయుతంగా స్పందించి, సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నీట మునిగిన పంటలకు నష్టపరిహారం అందించడంతో పాటు తక్షణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రైతు విభాగ అధ్యక్షులు జిన్నూరి వెంకటేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీను, సూరిబాబు, రైతులు పాల్గొన్నారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం నియోజకవర్గం జనుపల్లి గ్రామంలో పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ స్వయంగా పరిశీలించారు. పంటలు నీట మునిగి నష్టపోతున్న రైతులు సమస్య పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును కలిసి విజ్ఞప్తి చేయగా, ‘‘ఇవన్నీ కాటన్ దొర చేసిన తప్పులు’’ అని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమని శ్రీకాంత్ ప్రశ్నించారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో బాధ్యతాయుతంగా స్పందించి, సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నీట మునిగిన పంటలకు నష్టపరిహారం అందించడంతో పాటు తక్షణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రైతు విభాగ అధ్యక్షులు జిన్నూరి వెంకటేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీను, సూరిబాబు, రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.