Wednesday, 27 May 2026
  • Home  
  • పసుపుమయంగా మారిన ఆత్మకూరు

మహానాడు సందడితో కళకళలాడిన నియోజకవర్గం టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలతో పండుగ వాతావరణం – మంత్రి ఆనం ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లు ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు ఆత్మకూరు నియోజకవర్గంలో బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహానాడు కార్యక్రమాలు ఆత్మకూరును పూర్తిగా పసుపుమయంగా మార్చేశాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈసారి “స్త్రీ శక్తి” థీమ్‌తో మహానాడును ప్రత్యేక ఆకర్షణగా నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, సంక్షేమం, అభివృద్ధి అంశాలను ప్రధానంగా తీసుకుని కార్యక్రమాలను రూపొందించారు. వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడును కార్యకర్తలు, అభిమానులు వీక్షించేందుకు ప్రతి క్లస్టర్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, ఆధునిక సౌండ్ సిస్టమ్స్, ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు.సంగం మండలం సిద్ధిపురంలో పార్టీ జెండా ఆవిష్కరణతో మహానాడు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతున్న మహానాడును వీక్షించారు. మహానాడు సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం పసుపు జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లతో కళకళలాడింది. ప్రధాన రహదారులు, సభా ప్రాంగణాలు, గ్రామాలు, పట్టణాల్లో పార్టీ జెండాలు రెపరెపలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపించాయి. కార్యకర్తలు పసుపు కండువాలు ధరించి భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.11 క్లస్టర్లలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాలకు మహిళలు, యువత, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సభా ప్రాంగణాలు కార్యకర్తల సందడితో కిక్కిరిసిపోయాయి. “జై ఎన్టీఆర్”, “జై తెలుగుదేశం”, “చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలతో వేదికలు మారుమోగాయి.మహానాడు కార్యక్రమం విజయవంతం కావడానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతసాగరం మండలంలోని చిలకలమర్రి మల్లెంకొండయ్య స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన మహానాడు వేదికతో పాటు అనంతసాగరం నేషనల్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. పసుపు కండువాలు ధరించిన కార్యకర్తలు నినాదాలతో సభా ప్రాంగణాలను మారుమోగించారు. ఆత్మకూరు రూరల్ పరిధిలోని శ్రీధర్ గార్డెన్స్ కన్వెన్షన్ హాల్ వద్ద, అలాగే ఆత్మకూరు పట్టణంలోని రవితేజ కళ్యాణమండపంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కేంద్ర కార్యాలయం నుంచి ప్రసారమైన మహానాడును కార్యకర్తలు ఉత్సాహంగా వీక్షించారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో వేదికలను ప్రత్యేకంగా అలంకరించారు. ఏఎస్‌పేటలోని కామాక్షి కళ్యాణమండపంలో నిర్వహించిన మహానాడు సంబరాల్లో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి ఆనం అక్కడికి చేరుకుని కార్యకర్తలతో మమేకమయ్యారు. మహిళలు, యువత, గ్రామస్థాయి నాయకులు భారీగా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. సంగం మండలంలోని సంగం, సిద్ధిపురం ప్రాంతాల్లో ఊహించని స్థాయిలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. “జై ఎన్టీఆర్”, “జై తెలుగుదేశం” అంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతాలు మారుమోగాయి. మహానాడు సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చేజర్ల మండలంలోని సాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన మహానాడు క్లస్టర్ కార్యక్రమానికి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అక్కడికి చేరుకుని కార్యకర్తలతో కలిసి మహానాడులో పాల్గొన్నారు. సభా ప్రాంగణం మొత్తం పసుపు జెండాలతో కళకళలాడింది.  ప్రతి వేదిక వద్ద తాగునీరు, అల్పాహారం, భోజనం, పార్కింగ్, భద్రత, విద్యుత్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం పార్టీ శ్రేణులు కట్టుబడి పనిచేస్తున్నాయని అన్నారు. సామాన్య ప్రజల సంక్షేమం, మహిళా సాధికారత, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే పార్టీ ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని పేర్కొన్నారు.మహానాడు కార్యక్రమాల ద్వారా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నదని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు కృషి చేయాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు.ఎక్కడ చూసినా మహానాడు సందడితో ఆత్మకూరు నియోజకవర్గం పూర్తిగా పసుపుమయంగా మారి పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

మహానాడు సందడితో కళకళలాడిన నియోజకవర్గం


టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలతో పండుగ వాతావరణంమంత్రి ఆనం ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లు

ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు ఆత్మకూరు నియోజకవర్గంలో బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహానాడు కార్యక్రమాలు ఆత్మకూరును పూర్తిగా పసుపుమయంగా మార్చేశాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

ఈసారి “స్త్రీ శక్తి” థీమ్‌తో మహానాడును ప్రత్యేక ఆకర్షణగా నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, సంక్షేమం, అభివృద్ధి అంశాలను ప్రధానంగా తీసుకుని కార్యక్రమాలను రూపొందించారు. వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడును కార్యకర్తలు, అభిమానులు వీక్షించేందుకు ప్రతి క్లస్టర్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, ఆధునిక సౌండ్ సిస్టమ్స్, ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు.సంగం మండలం సిద్ధిపురంలో పార్టీ జెండా ఆవిష్కరణతో మహానాడు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతున్న మహానాడును వీక్షించారు.

మహానాడు సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం పసుపు జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లతో కళకళలాడింది. ప్రధాన రహదారులు, సభా ప్రాంగణాలు, గ్రామాలు, పట్టణాల్లో పార్టీ జెండాలు రెపరెపలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపించాయి. కార్యకర్తలు పసుపు కండువాలు ధరించి భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.11 క్లస్టర్లలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాలకు మహిళలు, యువత, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సభా ప్రాంగణాలు కార్యకర్తల సందడితో కిక్కిరిసిపోయాయి. “జై ఎన్టీఆర్”, “జై తెలుగుదేశం”, “చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలతో వేదికలు మారుమోగాయి.మహానాడు కార్యక్రమం విజయవంతం కావడానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతసాగరం మండలంలోని చిలకలమర్రి మల్లెంకొండయ్య స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన మహానాడు వేదికతో పాటు అనంతసాగరం నేషనల్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన కార్యక్రమాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా హాజరై పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. పసుపు కండువాలు ధరించిన కార్యకర్తలు నినాదాలతో సభా ప్రాంగణాలను మారుమోగించారు.

ఆత్మకూరు రూరల్ పరిధిలోని శ్రీధర్ గార్డెన్స్ కన్వెన్షన్ హాల్ వద్ద, అలాగే ఆత్మకూరు పట్టణంలోని రవితేజ కళ్యాణమండపంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కేంద్ర కార్యాలయం నుంచి ప్రసారమైన మహానాడును కార్యకర్తలు ఉత్సాహంగా వీక్షించారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో వేదికలను ప్రత్యేకంగా అలంకరించారు.

ఏఎస్‌పేటలోని కామాక్షి కళ్యాణమండపంలో నిర్వహించిన మహానాడు సంబరాల్లో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి ఆనం అక్కడికి చేరుకుని కార్యకర్తలతో మమేకమయ్యారు. మహిళలు, యువత, గ్రామస్థాయి నాయకులు భారీగా పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.

సంగం మండలంలోని సంగం, సిద్ధిపురం ప్రాంతాల్లో ఊహించని స్థాయిలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. “జై ఎన్టీఆర్”, “జై తెలుగుదేశం” అంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతాలు మారుమోగాయి. మహానాడు సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

చేజర్ల మండలంలోని సాయి కళ్యాణ మండపంలో నిర్వహించిన మహానాడు క్లస్టర్ కార్యక్రమానికి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అక్కడికి చేరుకుని కార్యకర్తలతో కలిసి మహానాడులో పాల్గొన్నారు. సభా ప్రాంగణం మొత్తం పసుపు జెండాలతో కళకళలాడింది.

 ప్రతి వేదిక వద్ద తాగునీరు, అల్పాహారం, భోజనం, పార్కింగ్, భద్రత, విద్యుత్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం పార్టీ శ్రేణులు కట్టుబడి పనిచేస్తున్నాయని అన్నారు. సామాన్య ప్రజల సంక్షేమం, మహిళా సాధికారత, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే పార్టీ ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని పేర్కొన్నారు.మహానాడు కార్యక్రమాల ద్వారా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నదని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు కృషి చేయాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు.ఎక్కడ చూసినా మహానాడు సందడితో ఆత్మకూరు నియోజకవర్గం పూర్తిగా పసుపుమయంగా మారి పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.