నెల్లూరు: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, కాలుష్యాన్ని అరికట్టి, మొక్కలు నాటడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడ్వకేట్ టీ. గోపాల్ రెడ్డి, వై. కోటేశ్వరరావు, దుర్గమ్మ, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొని ర్యాలీ నిర్వహించారు.



