ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 5 ( పున్నమి ప్రతినిధి)
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలు కేఆర్‌పురం సెంటర్‌లో శ్రీ సేవానాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ ఫౌండర్ మాసిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం, జూట్ బ్యాగులు పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. చెట్లను కాపాడితే అవే మనల్ని కాపాడతాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సేవానాదం ట్రస్ట్ సభ్యులు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 5 ( పున్నమి ప్రతినిధి) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలు కేఆర్‌పురం సెంటర్‌లో శ్రీ సేవానాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ ఫౌండర్ మాసిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం, జూట్ బ్యాగులు పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. చెట్లను కాపాడితే అవే మనల్ని కాపాడతాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

