వార్త ముఖ్యాంశాలు
- మూడు సబ్స్టేషన్ల పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేత విశాఖపట్నం జిల్లా,పద్మనాభం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 16:: పద్మనాభం మండల ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సమాచారం అందించింది.
- గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్ జోన్–3, విశాఖపట్నం శ్రీ పోలాకి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు రేపు (17-11-2026, మంగళవారం) పద్మనాభం మండల పరిధిలోని పద్మనాభం, రేవిడి, బోని మూడు సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
- వాతావరణ పరిస్థితులు, తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఫీడర్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర ముందస్తు నిర్వహణ పనులు చేపట్టనున్నారు.
మూడు సబ్స్టేషన్ల పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేత
విశాఖపట్నం జిల్లా,పద్మనాభం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 16::
పద్మనాభం మండల ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సమాచారం అందించింది. గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆపరేషన్ జోన్–3, విశాఖపట్నం శ్రీ పోలాకి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు రేపు (17-11-2026, మంగళవారం) పద్మనాభం మండల పరిధిలోని పద్మనాభం, రేవిడి, బోని మూడు సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
వాతావరణ పరిస్థితులు, తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఫీడర్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర ముందస్తు నిర్వహణ పనులు చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ముందస్తు మరమ్మతులు, భద్రతా చర్యల్లో భాగంగా చేపడుతున్న ఈ పనులకు మండల ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు. ప్రజలు తమకు అవసరమైన పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్