వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌రోడ్డు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
- విశాఖపట్నం నుంచి బెంగళూరుకు 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న మణికంఠ ట్రావెల్స్ బస్సులో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.బస్సులో ఫైర్ అలారం మోగడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు.
- ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.
నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌రోడ్డు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న మణికంఠ ట్రావెల్స్ బస్సులో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.బస్సులో ఫైర్ అలారం మోగడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అగ్నిప్రమాదంతో బస్సు తీవ్రంగా దెబ్బతింది. ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు తరలించారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో 34 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.