నెల్లూరు జీజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
నెల్లూరు: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు వర్చువల్‌గా వీక్షించారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, అత్యవసర కాన్పులు, చిన్నారుల తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఈ కేంద్రం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుతాయని జేసీ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని గిరిధర్ రెడ్డి . కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే. మాధవి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


