Wednesday, 17 June 2026
  • Home  
  • …… నీట్ ఎగ్జామ్…ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్సుసౌకర్యం……
- News

…… నీట్ ఎగ్జామ్…ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్సుసౌకర్యం……

*నీట్ ఎగ్జామ్…ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం* అమరావతి: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్డ్డి తెలిపారు. హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులపై ప్రయాణ భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట అదనపు సర్వీసులు నడపాలని అధికారులను రాంప్రసాద్డ్డి ఆదేశించారు. నీట్ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 21న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.

*నీట్ ఎగ్జామ్…ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం*

అమరావతి: నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్డ్డి తెలిపారు. హాల్ టికెట్ చూపించిన నీట్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేలా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులపై ప్రయాణ భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట అదనపు సర్వీసులు నడపాలని అధికారులను రాంప్రసాద్డ్డి ఆదేశించారు. నీట్ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 21న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.