జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం నారాయణపురం (సముద్రాల) గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గా దేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఆగస్టు 24 నుండి 27 వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు జలాధివాసం, అంకురార్పణ కార్యక్రమాలు ప్రారంభంకాగా, మూడవ రోజు బుధవారం వైదిక మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారి విగ్రహ, ప్రాణ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కనకదుర్గ ఆలయ అభివృద్ధి కమిటీ, గ్రామ పురోహితుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

నారాయణపురంలో కనకదుర్గా దేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కనులపండువ