*నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి యల్లటూరు శ్రీనివాసరాజు గారు జన్మదిన శుభాకాంక్షలు*
*మాజీ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలసి శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కారం*
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం హైదరాబాద్లోని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి నివాసానికి వెళ్లిన యల్లటూరు శ్రీనివాసరాజు గారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కూడిన సంపూర్ణ జీవితం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకులు యల్లటూరు శివకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

