వసంత హైమావతి గారికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రముఖులు
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ, 27/11/2026:
మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు గారి సతీమణి, మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారి మాతృమూర్తి వసంత హైమావతి గారు కన్నుమూసిన విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఐతవరంలోని ఆమె స్వగృహానికి శుక్రవారం చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు.
హైమావతి గారి పార్థివదేహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించిన కెడిసిసిబి చైర్మన్ నెట్టెం రఘురాం గారు, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు గారు, కేడీసీసీబీ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు గారు.
అనంతరం మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైమావతి గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.

