జంతు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేరళలో ప్రసిద్ధి చెందిన ‘ఉట్టోలీ రామన్’ అనే ఏనుగును ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించాలని ఆదేశించింది.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దేవాలయ కార్యక్రమాల్లో ఏనుగును వినియోగించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జంతువుల సంక్షేమం విషయంలో కోర్టులు మౌనంగా ఉండలేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జంతు హక్కుల పరిరక్షణలో ఈ తీర్పు కీలకంగా మారనుంది.


