Friday, 31 July 2026
  • Home  
  • దివ్యాంగురాలికి వైద్య భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
- తిరుపతి

దివ్యాంగురాలికి వైద్య భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 31, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. తొట్టంబేడు మండలం పిల్లమేడు పంచాయతీ మామిడిగుంట హరిజనవాడలో నిర్వహించిన “ఇంటింటికి మీ సుధీరన్న” కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తూ, స్థానిక దివ్యాంగురాలు తులసి ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు. సరైన వైద్యం అందిస్తే ఆమె నడిచే అవకాశం ఉందనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు. అప్పటికప్పుడే చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడి, ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స ప్రారంభించాలని ఆదేశించారు. చికిత్సకు అయ్యే ఖర్చును తన సొంత నిధుల నుంచైనా భరిస్తానని, అవసరమైతే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా కూడా సాయం అందించి ఆమె పూర్తిగా నడిచే వరకు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. దివ్యాంగురాలి ఆవేదనకు స్పందించి కొండంత అభయాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉదారతపై గ్రామీణులు, బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.