Sunday, 13 September 2026
  • Home  
  • దళితుల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్
- తిరుపతి

దళితుల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్

రైల్వేకోడూరు: దళితుల భూములు, ఇంటి స్థలాలు, స్మశానాలు, దారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 24న సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్‌, సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. రైల్వేకోడూరు సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సిహెచ్‌.చంద్రశేఖర్‌, మండల కన్వీనర్‌ పి.జాన్‌ ప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగిపోగు పెంచలయ్య, ఏపీ కౌలుదారి సంఘం నాయకులు కంభం కేశవులు మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడిచినా దళితులపై కుల వివక్ష, అంటరానితనం కొనసాగుతుండటం బాధాకరమన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో దళితులకు భూములు దక్కకుండా భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని, కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం మిగులు భూములను దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. దళితుల అనుభవంలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు భూమి కొనుగోలు పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని, గ్రామాల్లో దళితులకు స్మశాన స్థలాలు కేటాయించి ప్రహరీ, బోరు, షెడ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలకు తిరుపతి కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

రైల్వేకోడూరు: దళితుల భూములు, ఇంటి స్థలాలు, స్మశానాలు, దారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 24న సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్‌, సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. రైల్వేకోడూరు సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సిహెచ్‌.చంద్రశేఖర్‌, మండల కన్వీనర్‌ పి.జాన్‌ ప్రసాద్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగిపోగు పెంచలయ్య, ఏపీ కౌలుదారి సంఘం నాయకులు కంభం కేశవులు మాట్లాడారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడిచినా దళితులపై కుల వివక్ష, అంటరానితనం కొనసాగుతుండటం బాధాకరమన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో దళితులకు భూములు దక్కకుండా భూ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని, కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం మిగులు భూములను దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. దళితుల అనుభవంలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు భూమి కొనుగోలు పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని, గ్రామాల్లో దళితులకు స్మశాన స్థలాలు కేటాయించి ప్రహరీ, బోరు, షెడ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలకు తిరుపతి కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.