దగదర్తి మండలం దగదర్తి పంచాయతీలోని బిట్-1, బిట్-2 ఎంపీటీసీ స్థానాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాలేపాటి భవాని, యాకశిరి సుజాతలు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో తమకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు మాలేపాటి లోకేష్, సీనియర్ నాయకులు కంచర్ల సునీల్, మాలేపాటి సుధాకర్, కంచర్ల కృష్ణ, సతీష్, గురుదేవి, రోహిత్, రాధిక తదితరులు చురుగ్గా పాల్గొన్నారు. నాయకులు ఇంటింటికీ తిరుగుతూ పార్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. చిన్నారులకు చాక్లెట్లు అందిస్తూ స్థానికులతో మమేకమయ్యారు.
