Monday, 14 September 2026
  • Home  
  • తూ.గో. జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షపాతం
- తూర్పు గోదావరి

తూ.గో. జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షపాతం

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు.జిల్లాలోని కొన్ని మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడగా, మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మండపేటలో అత్యధికంగా 37.4 మి.మీ. వర్షపాతంనమోదైంది. ఆ తర్వాత కొరుకొండలో 26.4 మి.మీ., రాజానగరంలో 15.2 మి.మీ., సీతానగరంలో 12.2 మి.మీ. వర్షం కురిసింది. అదేవిధంగా గోకవరం మండలంలో 11.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరం అర్బన్‌లో 9.0 మి.మీ., కడియం మండలంలో 1.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం వరకు నమోదైన వర్షాలతో జిల్లాలో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా సాధారణ జనజీవనానికి కొంత ఉపశమనం లభించింది. వ్యవసాయ పనులకు కూడా ఈ వర్షాలు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు. ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వర్షపాతం మండపేట: 37.4 మి.మీ. కొరుకొండ: 26.4 మి.మీ. రాజానగరం: 15.2 మి.మీ. సీతానగరం: 12.2 మి.మీ. గోకవరం: 11.4 మి.మీ. రాజమహేంద్రవరం అర్బన్: 9.0 మి.మీ. కడియం: 1.6 మి.మీ. జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలను సంబంధిత అధికారులు నమోదు చేసి వెల్లడించారు రాగల 12 గంటల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు.జిల్లాలోని కొన్ని మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడగా, మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదైంది.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మండపేటలో అత్యధికంగా 37.4 మి.మీ. వర్షపాతంనమోదైంది. ఆ తర్వాత కొరుకొండలో 26.4 మి.మీ., రాజానగరంలో 15.2 మి.మీ., సీతానగరంలో 12.2 మి.మీ. వర్షం కురిసింది.

అదేవిధంగా గోకవరం మండలంలో 11.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరం అర్బన్‌లో 9.0 మి.మీ., కడియం మండలంలో 1.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఉదయం వరకు నమోదైన వర్షాలతో జిల్లాలో వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా సాధారణ జనజీవనానికి కొంత ఉపశమనం లభించింది. వ్యవసాయ పనులకు కూడా ఈ వర్షాలు కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు.
ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వర్షపాతం
మండపేట: 37.4 మి.మీ.
కొరుకొండ: 26.4 మి.మీ.
రాజానగరం: 15.2 మి.మీ.
సీతానగరం: 12.2 మి.మీ.
గోకవరం: 11.4 మి.మీ.
రాజమహేంద్రవరం అర్బన్: 9.0 మి.మీ.
కడియం: 1.6 మి.మీ.
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలను సంబంధిత అధికారులు నమోదు చేసి వెల్లడించారు రాగల 12 గంటల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.