పున్నమి ప్రతినిధి :తిరుపతి
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ మన్నూరు సుగుణమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు.
తిరుపతితో పాటు తుడా పరిధిలోని ప్రాంతాలను మరింత ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అంశాలపై ఈ సందర్భంగా వారు ప్రధానంగా చర్చించారు.
నగరంలో పచ్చదనం పెంపొందించడం, పార్కులు, ప్రధాన కూడళ్ల సుందరీకరణ పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
భవిష్యత్తులో తుడా మరియు ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి, తిరుపతిని పర్యావరణహితమైన, సుందరమైన నగరంగా అభివృద్ధి చేయాలని వారు ఆకాంక్షించారు.


