ప్రస్తుత తమిళ పవిత్ర మాసం ‘పెరటాసి శనివారాలు’ మరియు గాంధీ జయంతి (అక్టోబర్ 2) లాంగ్ వీకెండ్ సెలవుల నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం జనసముద్రంగా మారింది. దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలిరావడంతో కొండపై ఊహించని రీతిలో రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మొత్తం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కాంప్లెక్స్ వెలుపలికి వచ్చి, శిలాతోరణం దాటి గోగర్భం డ్యామ్ సర్కిల్ సమీపంలోని అక్టోపస్ బిల్డింగ్ వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి


