వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: మండలంలోని తిరుమలపురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలి బోయిన బాల అంకయ్య ఘన విజయం సాధించారు.
- ఆయన 328 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు.
- మొత్తం ఓట్లలో వైసీపీకి 936, టీడీపీకి 608, స్వతంత్ర అభ్యర్థికి 18, నోటాకు 14 ఓట్లు పోలయ్యాయి.
ఉదయగిరి: మండలంలోని తిరుమలపురం ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలి బోయిన బాల అంకయ్య ఘన విజయం సాధించారు. ఆయన 328 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. మొత్తం ఓట్లలో వైసీపీకి 936, టీడీపీకి 608, స్వతంత్ర అభ్యర్థికి 18, నోటాకు 14 ఓట్లు పోలయ్యాయి. మరో 24 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. ఈ విజయంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. తన విజయానికి సహకరించిన వైసీపీ ఇన్‌ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డితో పాటు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలకు బాల అంకయ్య కృతజ్ఞతలు తెలిపారు.