Wednesday, 16 September 2026
  • Home  
  • తిరుపతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు: నరసింహ యాదవ్
- తిరుపతి

తిరుపతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు: నరసింహ యాదవ్

భూ కేటాయింపులపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన. ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌ నరసింహ యాదవ్ పున్నమి ప్రతినిధి,తిరుపతి సిటీ జూలై 31 తిరుపతి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని రాష్ట్ర యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. ఎవరు అడ్డుకున్నా తిరుపతి, రాయలసీమ అభివృద్ధిని ఆపలేరని స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. భూ కేటాయింపులపై తప్పుడు ప్రచారం వద్దు. ఈరోజు తిరుపతిలో భూ కేటాయింపుల పేరుతో సోషల్ మీడియాలో ఏదేదో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. “ఎవరు కాపీలు వేస్తే అక్కడ కోర్ట్లు కూడా చివాట్లు పెట్టాయి. అయినా మర్చిపోకుండా తగుదునమ్మా అని ప్రచారం చేస్తున్నారు” అని విమర్శించారు. తిరుపతి, తిరుమల అభివృద్ధి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే ప్రారంభమైందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. రోడ్లు, మున్సిపల్ ఆఫీస్ పై వ్యాఖ్యలు తాను తుడా చైర్మన్‌గా ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్లను అందరికీ ఉపయోగపడేలా రూపొందించామని తెలిపారు. గత ప్రభుత్వం సగంలో ఆపేసిన రోడ్లను కొనసాగించాలని ముఖ్యమంత్రి కలెక్టర్, అధికారులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.100 ఫీట్ రోడ్ కనెక్టివిటీతో రైతు బజార్ దగ్గర నగరపాలక సంస్థ కార్యాలయం కట్టాలని తుడా, మున్సిపల్ సంస్థలు తీర్మానం చేశాయని, కానీ ప్రత్యర్థులు అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ నిధులతో మున్సిపల్ ఆఫీస్ భవనాన్ని అర్ధాంతరంగా వదిలేశారని, ప్రభుత్వం నిధులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని అన్నారు. “మీలాంటి వారు అభివృద్ధి నిరోధకులు కాక మరెవరు?” అని ప్రశ్నించారు. జగన్ పై విమర్శలు. జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిన్న ఒక మహిళా ఎస్ఐపై దాడి ఘటనను ఉదహరిస్తూ, అధికారంలో లేకపోయినా ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. బిడ్డ చనిపోతే బాధిత కుటుంబాన్ని పరామర్శించడం నాయకుడి బాధ్యత అని, కానీ నిందితుడి తండ్రిని జైలుకు వెళ్లి పరామర్శించి ర్యాలీలు చేయడం సమాజం క్షమించదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా ఎన్నికలు గానీ, పాలన గానీ ఉండదని, ఎన్డీఏ కూటమి ప్రజల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు

భూ కేటాయింపులపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన. ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌ నరసింహ యాదవ్

పున్నమి ప్రతినిధి,తిరుపతి సిటీ జూలై 31

తిరుపతి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని రాష్ట్ర యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. ఎవరు అడ్డుకున్నా తిరుపతి, రాయలసీమ అభివృద్ధిని ఆపలేరని స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
భూ కేటాయింపులపై తప్పుడు ప్రచారం వద్దు. ఈరోజు తిరుపతిలో
భూ కేటాయింపుల పేరుతో సోషల్ మీడియాలో ఏదేదో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. “ఎవరు కాపీలు వేస్తే అక్కడ కోర్ట్లు కూడా చివాట్లు పెట్టాయి. అయినా మర్చిపోకుండా తగుదునమ్మా అని ప్రచారం చేస్తున్నారు” అని విమర్శించారు. తిరుపతి, తిరుమల అభివృద్ధి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే ప్రారంభమైందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు.
రోడ్లు, మున్సిపల్ ఆఫీస్ పై వ్యాఖ్యలు
తాను తుడా చైర్మన్‌గా ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్లను అందరికీ ఉపయోగపడేలా రూపొందించామని తెలిపారు. గత ప్రభుత్వం సగంలో ఆపేసిన రోడ్లను కొనసాగించాలని ముఖ్యమంత్రి కలెక్టర్, అధికారులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.100 ఫీట్ రోడ్ కనెక్టివిటీతో రైతు బజార్ దగ్గర నగరపాలక సంస్థ కార్యాలయం కట్టాలని తుడా, మున్సిపల్ సంస్థలు తీర్మానం చేశాయని, కానీ ప్రత్యర్థులు అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ నిధులతో మున్సిపల్ ఆఫీస్ భవనాన్ని అర్ధాంతరంగా వదిలేశారని, ప్రభుత్వం నిధులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని అన్నారు. “మీలాంటి వారు అభివృద్ధి నిరోధకులు కాక మరెవరు?” అని ప్రశ్నించారు.
జగన్ పై విమర్శలు.
జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిన్న ఒక మహిళా ఎస్ఐపై దాడి ఘటనను ఉదహరిస్తూ, అధికారంలో లేకపోయినా ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. బిడ్డ చనిపోతే బాధిత కుటుంబాన్ని పరామర్శించడం నాయకుడి బాధ్యత అని, కానీ నిందితుడి తండ్రిని జైలుకు వెళ్లి పరామర్శించి ర్యాలీలు చేయడం సమాజం క్షమించదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా ఎన్నికలు గానీ, పాలన గానీ ఉండదని, ఎన్డీఏ కూటమి ప్రజల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.