Saturday, 15 August 2026
  • Home  
  • జిల్లా సమగ్ర అభివృద్ధిపై సమీక్షలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పలు సమస్యల ప్రస్తావన
- తూర్పు గోదావరి

జిల్లా సమగ్ర అభివృద్ధిపై సమీక్షలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పలు సమస్యల ప్రస్తావన

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 14* జిల్లా సమగ్రాభివృద్ధిపై సమీక్షా సమావేశం (డిఆర్‌సి) కాకినాడ కలెక్టరేట్‌లోని వివేకానంద హాల్‌లో జిల్లా కలెక్టర్ హరింద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. *ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రధానంగా లేవనెత్తిన అంశాలు:* 1. *గృహ నిర్మాణం:* 2014 నుంచి నిర్మాణం పూర్తి చేసుకుని అకౌంట్లో రూపాయి పడి ఆన్‌లైన్ అయిన లబ్ధిదారులకు హౌసింగ్ రుణాలు అందించాలని, అలాగే గత రెండేళ్లలో ఇళ్లు పూర్తి చేసుకున్న వారికి హౌసింగ్ రుణాలను ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. 2. *ఇళ్ల స్థలాలు:* పోలవరం కాలువపై ఉన్న సాయిల్ బ్యాంక్‌ను ఖాళీ చేసి పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 3. *పారిశ్రామిక అభివృద్ధి:* మల్లిశాలలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 4. *వైద్య సౌకర్యాలు:* జాతీయ రహదారిపై జగ్గంపేట వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందున, అక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను, ఆక్సిజన్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. 5. *రైతులకు అవగాహన:* సూపర్ ఎలినో ప్రభావం నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అభ్యర్థించారు.సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ప్రభుత్వ విప్ యనమల దివ్య, ఎమ్మెల్యేలు చిన్నరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం పైమాన్ కమిటీ సభ్యుడు పెండెం దొరబాబు, జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.జిల్లా సమగ్రాభివృద్ధికి అందరూ సమన్వయంతో పని చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు.

కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,ఆగస్టు 14* జిల్లా సమగ్రాభివృద్ధిపై సమీక్షా సమావేశం (డిఆర్‌సి) కాకినాడ కలెక్టరేట్‌లోని వివేకానంద హాల్‌లో జిల్లా కలెక్టర్ హరింద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రధానంగా లేవనెత్తిన అంశాలు:*

1. *గృహ నిర్మాణం:* 2014 నుంచి నిర్మాణం పూర్తి చేసుకుని అకౌంట్లో రూపాయి పడి ఆన్‌లైన్ అయిన లబ్ధిదారులకు హౌసింగ్ రుణాలు అందించాలని, అలాగే గత రెండేళ్లలో ఇళ్లు పూర్తి చేసుకున్న వారికి హౌసింగ్ రుణాలను ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు.
2. *ఇళ్ల స్థలాలు:* పోలవరం కాలువపై ఉన్న సాయిల్ బ్యాంక్‌ను ఖాళీ చేసి పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
3. *పారిశ్రామిక అభివృద్ధి:* మల్లిశాలలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
4. *వైద్య సౌకర్యాలు:* జాతీయ రహదారిపై జగ్గంపేట వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందున, అక్కడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆర్థోపెడిక్ డాక్టర్‌ను, ఆక్సిజన్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
5. *రైతులకు అవగాహన:* సూపర్ ఎలినో ప్రభావం నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అభ్యర్థించారు.సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ప్రభుత్వ విప్ యనమల దివ్య, ఎమ్మెల్యేలు చిన్నరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం పైమాన్ కమిటీ సభ్యుడు పెండెం దొరబాబు, జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.జిల్లా సమగ్రాభివృద్ధికి అందరూ సమన్వయంతో పని చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.