Friday, 4 September 2026
  • Home  
  • జాతీయ కుటుంబ ప్రయోజనం నిరంతరం కొనసాగే ప్రక్రియ : జిల్లా కలెక్టర్
- తెలంగాణ

జాతీయ కుటుంబ ప్రయోజనం నిరంతరం కొనసాగే ప్రక్రియ : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి ) జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆసరా పెన్షన్ లాంటివి వస్తున్నప్పటికి ఈపథకానికి అర్హులని తెలిపారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఒకేసారి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. మంగళవారం(సెప్టెంబర్ 2) ఆమె నల్గొండ జిల్లా గుండ్లపల్లి ( డిండి) ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్లపై సమీక్షించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారిగా మౌలిక వసతులు, ఓటర్లు, మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై తహసిల్దార్ శ్రీనివాస్ తో మాట్లాడుతూ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులన్నింటిని విచారణ చేసి త్వరితగతిన ఆర్డీవోకు పంపించాలని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించి వంటగదిని, డైనింగ్, పరిసరాలను తరగతి గదులను తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడుతూ వివిధ కూరగాయలు, ఆకుకూరల వల్ల కలిగే ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జాతీయ కుటుంబ ప్రయోజనం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, అయితే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఈ పథకం కింద సరైన దరఖాస్తులు రానందున నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా డ్రైవ్ లా నిర్వహించి అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

నకిరేకల్ : సెప్టెంబర్ ( పున్నమి ప్రతినిధి )
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆసరా పెన్షన్ లాంటివి వస్తున్నప్పటికి
ఈపథకానికి అర్హులని తెలిపారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఒకేసారి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు.
మంగళవారం(సెప్టెంబర్ 2) ఆమె నల్గొండ జిల్లా గుండ్లపల్లి ( డిండి) ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్లపై సమీక్షించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారిగా మౌలిక వసతులు, ఓటర్లు, మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాలు, ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై తహసిల్దార్ శ్రీనివాస్ తో మాట్లాడుతూ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులన్నింటిని విచారణ చేసి త్వరితగతిన ఆర్డీవోకు పంపించాలని చెప్పారు.
అనంతరం మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించి వంటగదిని, డైనింగ్, పరిసరాలను తరగతి గదులను తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడుతూ వివిధ కూరగాయలు, ఆకుకూరల వల్ల కలిగే ప్రయోజనాలపై వారికి అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జాతీయ కుటుంబ ప్రయోజనం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, అయితే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఈ పథకం కింద సరైన దరఖాస్తులు రానందున నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా డ్రైవ్ లా నిర్వహించి అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

0 Comments

  1. 光算科技

    September 2, 2025

    Great beat ! I would like to apprentice while you amend your website, how could i subscribe for a weblog website? The account helped me a appropriate deal. I were tiny bit familiar of this your broadcast provided bright clear concept

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.