నిర్మల్ జిల్లా అక్టోబర్ 02 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్: ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలు తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. జర్నలిస్టులకు బస్ పాసులు, పిల్లల చదువులకు 50 శాతం ఫీజు రాయితీలు వంటి సాధారణ సౌకర్యాలకే పరిమితం కాకుండా, వారి జీవితాలకు భరోసా ఇచ్చే కొత్త పథకాలను అమలు చేయాలని కోరుతోంది.
జర్నలిస్టులు తమ జీవితాలను ప్రజాసేవకే అంకితం చేస్తూ, ఎండనకా వాననకా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, అలాంటి వారికి వృత్తిపరమైన గుర్తింపుతో పాటు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంటోంది.
ఈ నేపథ్యంలో పార్టీ తరఫున పలు కీలక డిమాండ్లను ముందుకు తెస్తోంది.
ప్రధాన డిమాండ్లు:
1. జర్నలిస్టులకు వయస్సు, సేవా కాలాన్ని బట్టి నెలవారీ పెన్షన్ రూపంలో గౌరవ వేతనం అందించాలి.
2. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో కనీసం 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలి.
3. సొంత స్థలం ఉన్న జర్నలిస్టులకు ఇంటి నిర్మాణం కోసం తక్కువ వడ్డీతో ప్రభుత్వ రుణాలు అందించాలి.
4. గృహ రుణాలపై వడ్డీ రాయితీ కల్పించి సొంతింటి కలను నిజం చేయాలి.
5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని అర్హత ఆధారిత సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు వర్తింపజేయాలి.
6. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత లేదా నగదు రహిత వైద్య సేవలు అందించాలి.
7. విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం, అర్హులైన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలి.
8. చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు కూడా గుర్తింపు, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.
9. ప్రజా సమస్యలపై పరిశోధనాత్మక కథనాలు, వినూత్న ఆలోచనలతో సమాజంలో మార్పు తీసుకొచ్చే జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలు, ప్రోత్సాహకాలు అందించాలి.
10. జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సమయానికి జీతాలు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
11. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు జరిగినప్పుడు వెంటనే స్పందించే ప్రత్యేక రక్షణ వ్యవస్థను తీసుకురావాలి.
12. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వాలు జర్నలిస్టులను కేవలం వార్తలు రాసే వ్యక్తులుగా కాకుండా, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే బాధ్యతాయుతమైన వృత్తి నిపుణులుగా గుర్తించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతోంది. జర్నలిస్టుల సంక్షేమం అనేది కేవలం కొన్ని రాయితీలకు పరిమితం కాకుండా, వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే సమగ్ర విధానంగా మారాలని, ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి దశలవారీగా అమలు చేయాలని పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమం లో ఆప్ జిల్లా జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, నియోజకవర్గ ఇంచార్జి మెరుగు రాజన్న, స్పోక్స్‌పర్సన్ వసంత్ రావు తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు బస్ పాసులు, ఫీజు రాయితీలే కాదు.. గౌరవ వేతనం, ఇంటి రుణాలు కూడా కల్పించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్
నిర్మల్ జిల్లా అక్టోబర్ 02 (పున్నమి ప్రతినిధి) నిర్మల్: ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తూ, ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలు తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. జర్నలిస్టులకు బస్ పాసులు, పిల్లల చదువులకు 50 శాతం ఫీజు రాయితీలు వంటి సాధారణ సౌకర్యాలకే పరిమితం కాకుండా, వారి జీవితాలకు భరోసా ఇచ్చే కొత్త పథకాలను అమలు చేయాలని కోరుతోంది. జర్నలిస్టులు తమ జీవితాలను ప్రజాసేవకే అంకితం చేస్తూ, ఎండనకా వాననకా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని, అలాంటి వారికి వృత్తిపరమైన గుర్తింపుతో పాటు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున పలు కీలక డిమాండ్లను ముందుకు తెస్తోంది. ప్రధాన డిమాండ్లు: 1. జర్నలిస్టులకు వయస్సు, సేవా కాలాన్ని బట్టి నెలవారీ పెన్షన్ రూపంలో గౌరవ వేతనం అందించాలి. 2. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో కనీసం 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలి. 3. సొంత స్థలం ఉన్న జర్నలిస్టులకు ఇంటి నిర్మాణం కోసం తక్కువ వడ్డీతో ప్రభుత్వ రుణాలు అందించాలి. 4. గృహ రుణాలపై వడ్డీ రాయితీ కల్పించి సొంతింటి కలను నిజం చేయాలి. 5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని అర్హత ఆధారిత సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు వర్తింపజేయాలి. 6. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత లేదా నగదు రహిత వైద్య సేవలు అందించాలి. 7. విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం, అర్హులైన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలి. 8. చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా, ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు కూడా గుర్తింపు, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. 9. ప్రజా సమస్యలపై పరిశోధనాత్మక కథనాలు, వినూత్న ఆలోచనలతో సమాజంలో మార్పు తీసుకొచ్చే జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలు, ప్రోత్సాహకాలు అందించాలి. 10. జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సమయానికి జీతాలు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 11. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు జరిగినప్పుడు వెంటనే స్పందించే ప్రత్యేక రక్షణ వ్యవస్థను తీసుకురావాలి. 12. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాలు జర్నలిస్టులను కేవలం వార్తలు రాసే వ్యక్తులుగా కాకుండా, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే బాధ్యతాయుతమైన వృత్తి నిపుణులుగా గుర్తించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతోంది. జర్నలిస్టుల సంక్షేమం అనేది కేవలం కొన్ని రాయితీలకు పరిమితం కాకుండా, వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే సమగ్ర విధానంగా మారాలని, ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి దశలవారీగా అమలు చేయాలని పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమం లో ఆప్ జిల్లా జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, నియోజకవర్గ ఇంచార్జి మెరుగు రాజన్న, స్పోక్స్‌పర్సన్ వసంత్ రావు తదితరులు పాల్గొన్నారు.

