Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

జఫర్‌గఢ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో దిగ్విజయంగా శస్త్రచికిత్సలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జఫర్‌గఢ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో దిగ్విజయంగా శస్త్రచికిత్సలు

వార్త ముఖ్యాంశాలు

  • జఫర్‌గఢ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో దిగ్విజయంగా శస్త్రచికిత్సలు -------------------------------- *కుటుంబ నియంత్రణ, సిజేరియన్ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహణ-- జఫర్‌గఢ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ సంధ్య ఆధ్వర్యంలో శుక్రవారం విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా దేవరాయ శైలజకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సను, సఖి ఝాన్సీకి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ప్రసవాన్ని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.
  • ప్రస్తుతం ఇరువురు పేషెంట్లు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

జఫర్‌గఢ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో దిగ్విజయంగా శస్త్రచికిత్సలు
——————————–
*కుటుంబ నియంత్రణ, సిజేరియన్ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహణ–

జఫర్‌గఢ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా సమన్వయకర్త (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ సంధ్య ఆధ్వర్యంలో శుక్రవారం విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవరాయ శైలజకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సను, సఖి ఝాన్సీకి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ప్రసవాన్ని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇరువురు పేషెంట్లు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమష్టి కృషి, సమన్వయం, అంకితభావంతో శస్త్రచికిత్సలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనడానికి ఈ శస్త్రచికిత్సలు నిదర్శనమని వైద్యాధికారులు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జఫర్‌గఢ్ సామాజిక ఆరోగ్య కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ శస్త్రచికిత్సల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రావణి, అనస్థీషియా వైద్యులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ వసుంధర, చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ ప్రియాంక, హెడ్ నర్సులు సంగీత, శౌరి, స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్లు శ్వేత, లక్ష్మి, సుధారాణి, థియేటర్ అసిస్టెంట్ ఎండీ రఫీయుద్దీన్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *