జన హృదయ నేత కల్వకుంట్ల గోపాల్రావుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 9 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్: BRS పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్రావు జన్మదిన సందర్భంగా మండల, పట్టణ BRS నాయకులు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ముస్తాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు ఏద్దండీ నర్సింహారెడ్డి, మాజీ మండల కో-ఆప్షన్ సభ్యులు అన్వర్, BRS పార్టీ సోషల్ మీడియా వారియర్ పరిదిపేట వెంకటేష్ తదితరులు గోపాల్రావును కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.


