Wednesday, 22 July 2026
  • Home  
  • జనగామ రూట్ బస్సు మార్పుపై నిరసన: విద్యార్థులు, గ్రామస్థుల ఆందోళన
- జనగాం

జనగామ రూట్ బస్సు మార్పుపై నిరసన: విద్యార్థులు, గ్రామస్థుల ఆందోళన

​జనగామ జిల్లా: సముద్రాల నుండి కోమటిగూడెం, రంగరాయిగూడెం మీదుగా జనగామకు వెళ్లే ఆర్టీసీ బస్సు రూట్ మార్పు విద్యార్థులకు శాపంగా మారింది. గతంలో నడిచిన పల్లె వెలుగు బస్సు స్థానంలో ఎక్స్ప్రెస్ బస్సును నడుపుతుండడంతో పాటు, ఆ బస్సు నేరుగా జనగామకు వెళ్లకుండా నర్మెట వెళ్లి వస్తుండడంతో విద్యార్థులు సమయానికి కాలేజీలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ​ఈ ప్రయాణ మార్పు వల్ల ప్రయాణ సమయం విపరీతంగా పెరుగుతుండగా, మరోవైపు పల్లె వెలుగు బస్సు ప్లేసులో ఎక్స్ప్రెస్ బస్సు నడపడం వల్ల విద్యార్థులకు ఉచిత బస్సు పాస్‌లు వర్తించక, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ​ఈ తీవ్ర సమస్యలపై కోమటిగూడెం గ్రామ సర్పంచ్ పనికర సోమయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్థులు, వార్డు సభ్యులు అందరూ కలిసి బస్సు ఎదుట నిరసన తెలిపారు. విద్యార్థుల చదువుకు కలుగుతున్న ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి పాత రూట్లోనే బస్సును నడిపేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

​జనగామ జిల్లా:
సముద్రాల నుండి కోమటిగూడెం, రంగరాయిగూడెం మీదుగా జనగామకు వెళ్లే ఆర్టీసీ బస్సు రూట్ మార్పు విద్యార్థులకు శాపంగా మారింది. గతంలో నడిచిన పల్లె వెలుగు బస్సు స్థానంలో ఎక్స్ప్రెస్ బస్సును నడుపుతుండడంతో పాటు, ఆ బస్సు నేరుగా జనగామకు వెళ్లకుండా నర్మెట వెళ్లి వస్తుండడంతో విద్యార్థులు సమయానికి కాలేజీలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
​ఈ ప్రయాణ మార్పు వల్ల ప్రయాణ సమయం విపరీతంగా పెరుగుతుండగా, మరోవైపు పల్లె వెలుగు బస్సు ప్లేసులో ఎక్స్ప్రెస్ బస్సు నడపడం వల్ల విద్యార్థులకు ఉచిత బస్సు పాస్‌లు వర్తించక, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
​ఈ తీవ్ర సమస్యలపై కోమటిగూడెం గ్రామ సర్పంచ్ పనికర సోమయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామస్థులు, వార్డు సభ్యులు అందరూ కలిసి బస్సు ఎదుట నిరసన తెలిపారు. విద్యార్థుల చదువుకు కలుగుతున్న ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి పాత రూట్లోనే బస్సును నడిపేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.