Sunday, 20 September 2026
  • Home  
  • చేనేత కార్మికుల మహాసభలను జయప్రదం చేయాలి: సీపీఐ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేనేత కార్మికుల మహాసభలను జయప్రదం చేయాలి: సీపీఐ

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నెల్లూరు జిల్లా 14వ మహాసభలను జయప్రదం చేయాలి – సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అరిగెల సాయి… ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నెల్లూరు జిల్లా 14వ మహాసభలను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నెల్లూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అరిగెల సాయి పిలుపునిచ్చారు. మహాసభల కరపత్రాన్ని సీపీఐ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ అరిగెల సాయి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉపాధి భద్రత కోసం సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నెల్లూరులోని ఆరు ఎకరాల 90 సెంట్ల స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చేనేత కార్మికుల ప్రయోజనాలకు వినియోగించడం, చేనేత ఉత్పత్తులపై ఉన్న జీఎస్టీని వెంటనే రద్దు చేయడం, 1995 సవరణ ప్రకారం 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, ముద్ర రుణాలను రెండు లక్షల రూపాయలకు పెంచి సబ్సిడీని వర్తింపజేయడం వంటి డిమాండ్లపై చర్చించి పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి చేనేత కార్మికునికి మూడు సెంట్ల ప్రభుత్వ స్థలంలో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని, ప్రతి చేనేత మహిళా కార్మికురాలికి ప్రభుత్వ సహాయంతో నెలకు రూ.3,000 అందించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కోసం నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలని, రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌లో చేనేతలకు ప్రత్యేకంగా రూ.2,000 కోట్ల నిధులు కేటాయించాలని, రాజీవ్ విద్యా మిషన్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పముజుల హరి మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్ ఉద్యమాలకు మహాసభలు దిశానిర్దేశం చేయనున్నాయని తెలిపారు. 2026 సెప్టెంబర్ 27న నెల్లూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నెల్లూరు జిల్లా 14వ మహాసభలకు చేనేత కార్మికులు, సంఘ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు దామా అంకయ్య, సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, AITUC జిల్లా కార్యదర్శి యామాల మధు, నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు సిరాజ్,షాన్వాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నెల్లూరు జిల్లా 14వ మహాసభలను జయప్రదం చేయాలి – సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అరిగెల సాయి…
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నెల్లూరు జిల్లా 14వ మహాసభలను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నెల్లూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అరిగెల సాయి పిలుపునిచ్చారు. మహాసభల కరపత్రాన్ని సీపీఐ నాయకులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా కామ్రేడ్ అరిగెల సాయి మాట్లాడుతూ.. చేనేత కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉపాధి భద్రత కోసం సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నెల్లూరులోని ఆరు ఎకరాల 90 సెంట్ల స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చేనేత కార్మికుల ప్రయోజనాలకు వినియోగించడం, చేనేత ఉత్పత్తులపై ఉన్న జీఎస్టీని వెంటనే రద్దు చేయడం, 1995 సవరణ ప్రకారం 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, ముద్ర రుణాలను రెండు లక్షల రూపాయలకు పెంచి సబ్సిడీని వర్తింపజేయడం వంటి డిమాండ్లపై చర్చించి పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
అలాగే ప్రతి చేనేత కార్మికునికి మూడు సెంట్ల ప్రభుత్వ స్థలంలో పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని, ప్రతి చేనేత మహిళా కార్మికురాలికి ప్రభుత్వ సహాయంతో నెలకు రూ.3,000 అందించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కోసం నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలని, రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌లో చేనేతలకు ప్రత్యేకంగా రూ.2,000 కోట్ల నిధులు కేటాయించాలని, రాజీవ్ విద్యా మిషన్ పథకాన్ని అమలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పముజుల హరి మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్ ఉద్యమాలకు మహాసభలు దిశానిర్దేశం చేయనున్నాయని తెలిపారు.
2026 సెప్టెంబర్ 27న నెల్లూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నెల్లూరు జిల్లా 14వ మహాసభలకు చేనేత కార్మికులు, సంఘ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు దామా అంకయ్య, సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, AITUC జిల్లా కార్యదర్శి యామాల మధు, నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు సిరాజ్,షాన్వాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.