చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై దృష్టి సారిస్తూ రాజుర గ్రామంలో మహిళా మోర్చా జిల్లా కో-కన్వీనర్ తోకల సరస్వతి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారికి అందుతున్న ఆహారం, పాలు, గుడ్లు తదితర పోషకాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం నిరంతరం అందేలా అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సరస్వతి సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం, పాలు, గుడ్లు తదితర పోషకాహారాన్ని చిన్నారులకు క్రమం తప్పకుండా అందిస్తున్నామని అంగన్వాడీ టీచర్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యామల, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చిన్నారుల పోషణపై ప్రత్యేక దృష్టి
చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై దృష్టి సారిస్తూ రాజుర గ్రామంలో మహిళా మోర్చా జిల్లా కో-కన్వీనర్ తోకల సరస్వతి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారికి అందుతున్న ఆహారం, పాలు, గుడ్లు తదితర పోషకాహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం నిరంతరం అందేలా అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సరస్వతి సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం, పాలు, గుడ్లు తదితర పోషకాహారాన్ని చిన్నారులకు క్రమం తప్పకుండా అందిస్తున్నామని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యామల, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

