Wednesday, 30 September 2026
  • Home  
  • చిట్టి ల పేరుతో ప్రభుత్వ టీచర్ మోసం
- తెలంగాణ - మహబూబాబాద్

చిట్టి ల పేరుతో ప్రభుత్వ టీచర్ మోసం

*చిట్టీల పేరుతో మోసం.. రూ. 10 కోట్లతో పరారైన ప్రభుత్వ టీచర్*సూర్యాపేట జిల్లాలో ఘటనకుటుంబంతో కలిసి పరారు కావడంతో వెలుగులోకి 12 గ్రామాల ప్రజలు, బంధువుల నుంచి భారీగా డబ్బు సేకరణపక్కా ప్లాన్‌తో భూములు అమ్మి, హైదరాబాద్‌లో డ్రామా ఆడి పరారీచిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుటుంబం కలిసి పరారైన ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది. బాధితులు శనివారం జిల్లా ఎస్పీ నరసింహను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.చివ్వెంల మండలం ఏనేగండి తండాకు చెందిన ఓ వ్యక్తి, ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నాడు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తూ, ఆరేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తన సొంత తండాతో పాటు చుట్టుపక్కల 12 గ్రామాల ప్రజలు, బంధువులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వద్ద నమ్మకంగా ఉంటూ డబ్బులు కట్టించుకున్నాడు.ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.30 కోట్ల వరకు వసూలు చేశాడు. కొందరికి ప్రామిసరీ నోట్లు రాసి ఇవ్వగా, మరికొందరికి నెలవారీగా అధిక లాభాలు ఇస్తానని నమ్మించాడు. ఇలా రూ.10 కోట్లకు పైగా సమీకరించాడు. అయితే, ఏడాదిగా డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితులు ఒత్తిడి చేస్తుండటంతో వాయిదాలు వేస్తూ వస్తున్నాడు.ఈ క్రమంలోనే, పరారయ్యేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. తనకున్న 4 ఎకరాల భూమిలో ఎక్కువ భాగాన్ని ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించి, తన పేరిట కేవలం 13 గుంటలు మాత్రమే ఉంచుకున్నాడు. సుమారు పది రోజుల క్రితం, హైదరాబాద్‌లో ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవాలని చెప్పి ఇద్దరు గ్రామస్థులను తనతో తీసుకెళ్లాడు. అక్కడ ఓ హోటల్‌లో కూర్చుని తాను అప్పుల్లో కూరుకుపోయానని చెప్పి, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు, సూర్యాపేట, తండాలోని అతడి ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు వేసి ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆ డబ్బును ఏం చేశాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.