శ్రీ కాళహస్తి, మే 27, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలంలోని చల్లపాలెం గ్రామానికి చెందిన తుమ్ముల సుబ్బరాయులు ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి బుధవారం చల్లపాలెం గ్రామంలో పర్యటించారు. మృతుడి నివాసానికి వెళ్లిన ఆయన సుబ్బరాయులు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం మృతుడి కుమారుడు కోటేశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఆకస్మిక మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంకిరెడ్డి, తుమ్ముల కేశవులు, నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చల్లపాలెంలో సుబ్బరాయులు కుటుంబానికి బియ్యపు ఆకర్ష్ రెడ్డి పరామర్శ