Sunday, 12 July 2026
  • Home  
  • ఘనంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి జన్మదిన వేడుకలు
- తిరుపతి

ఘనంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి జన్మదిన వేడుకలు

శ్రీ కాళహస్తి, జులై 11 : (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి, ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ జన్మదిన వేడుకలు ఊరందూరులోని వారి స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి మురళి నాయుడు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి, దుశ్శాలువా కప్పి, పండ్లను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బృందమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కుమారుడు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అండగా ఉంటూ, పేద ప్రజలకు మరింత సేవ చేసేలా వారి మార్గదర్శకత్వం కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ పేరం ధనంజయులు నాయుడు, మోహన్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ బత్తిరెడ్డి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ జైచంద్ర నాయుడు, ఎస్సీ సెల్ నాయకుడు సాలి రాజా, బాలాజీ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.