ఈ రోజు గోసేవా వారి ఆధ్వర్యంలో గోవిజ్ఞాన పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుచున్నవి. ఈ రోజు కొత్తగూడెం సింగరేణి స్కూల్ నందు స్వర్ణ కుమారి టీచర్ గోవిజ్ఞాన లెవెల్ -1పరీక్ష నిర్వహించారు . ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు, ఎడ్యుకేషన్ సింగరేణి GM, కరెస్పాండంట్, తదితరులు అభినందనలు తెలిపారు.లెవెల్-1 విజేతలైన విద్యార్థులు డిస్ట్రిక్ట్ రెండో స్థాయి లెవెల్ -2 పరీక్షలు శనివారం ఎడో తారీకు పాల్గొనాలి. తర్వాత మూడో స్థాయి స్టేట్ లెవెల్ -3 పరీక్షలు హైదరాబాద్ నందు 15 వ తారీకు జరుగును. పోటీలో ప్రధమ బహుమతి లక్ష రూపాయలు, రెండో బహుమతి 50 వేలు, మూడో బహుమతి 25 వేలు గా నిర్దారించారు. మరియు ప్రొచాహక బహుమతులు పొందగలరని గోసేవా ప్రముఖ్ యాకస్వామి, సహాయకులు గుమలాపురం సత్యనారాయణ తెలిపారు. ఈ పాఠశాల నుండి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినిలు కూడా పరీక్షలో పాల్గొనడం ఒక ప్రత్యేకమైన విషయం అని తెలిపారు.

