Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

6 కోట్ల 90 లక్షల ప్రజాధనం లూటి. 42 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
6 కోట్ల 90 లక్షల ప్రజాధనం లూటి. 42 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి

వార్త ముఖ్యాంశాలు

  • బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ 175 మెట్రిక్ టన్నుల బియ్యంలో దాదాపు 42 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమ మార్గంలో పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో విక్రాయించారని పేర్కొన్నారు.
  • 2025-2026 ఆర్థిక సంవత్సరములోనే సుమారు 6 కోట్ల 90 లక్షల ప్రజాధనం లూటి అయ్యిందని అన్నారు.
  • ఈ వ్యవహారంలో శ్రీజ ఇండస్ట్రీ మిల్లు అధినేత ఆళ్లమురళికృష్ణ పూర్తి బాధ్యత వహించారని రాజకీయ అండదండలు మరియు ఒక ముఖ్యమంత్రికి అనుచరుడిగా వున్న వ్యక్తి అందదండలు ఉండటం వల్ల ఈ అక్రమానికి పాల్పడటం సిగ్గు చేటన్నారు.

బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ 175 మెట్రిక్ టన్నుల బియ్యంలో దాదాపు 42 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమ మార్గంలో పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో విక్రాయించారని పేర్కొన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరములోనే సుమారు 6 కోట్ల 90 లక్షల ప్రజాధనం లూటి అయ్యిందని అన్నారు. ఈ వ్యవహారంలో శ్రీజ ఇండస్ట్రీ మిల్లు అధినేత ఆళ్లమురళికృష్ణ పూర్తి బాధ్యత వహించారని రాజకీయ అండదండలు మరియు ఒక ముఖ్యమంత్రికి అనుచరుడిగా వున్న వ్యక్తి అందదండలు ఉండటం వల్ల ఈ అక్రమానికి పాల్పడటం సిగ్గు చేటన్నారు. మూడు రోజులైనా FIR కాపీని రాజకీయ ఓతిల్లవల్ల బయట పెట్టకపోవటం పలు అనుమానాలకు దారితిస్తుందన్నారు. శ్రీజ ఇండస్ట్రీస్లో జరిగిన భారీ బియ్యం అక్రమాలపై సిబిఐ, ఈ డి, విజిలన్స్, పోరసరఫరా శాఖ విభాఘాలు సమగ్ర విచారణ జరపాలన్నారు. CPI జిల్లా కార్యదర్శి ఇంతటి భారీ అవినీతికి ఎందుకు స్పందించట్లేదని దానికి సమాధానం చెప్పాలన్నారు. అధికారులపై జరుగుతున్న ఓతిల్లపట్ల నిస్పక్షపాత విచారణ జరిపి ప్రజాధనాన్ని రికవరీ చేయాలన్నారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న, లేబర్ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ సబ్బని రాజేష్ కుమార్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, SC మోర్చా జిల్లా అధ్యక్షుడు రాకేష్ బాబు, ST మోక్ష ఉపాధ్యక్షుడు మంగీలాల్ నాయక్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పొదిల శ్రీనివాస్, కోల హరీష్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *